‘దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా’

30 Jun, 2020 15:52 IST|Sakshi

కామెడీ హీరో అల్లరి నరేశ్‌, పూజా జవేరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మంగళవారం హీరో నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. (అల్లరి నరేష్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్)

64 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో నరేశ్‌ తనదైన కామెడీ టైమింగ్‌ను జోడించాడు. హాస్యనటుల బృందం భారీగానే ఉండటంతో ఈ చిత్రం పూర్తి వినోదపు విందును అందించనుందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను, జబర్దస్త్‌ మహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘నాంది’ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి సూపర్బ్‌ రెస్సాన్స్‌ వస్తోంది. (అందుకే సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు