Sakshi News home page

పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్

Published Thu, Feb 25 2016 3:33 PM

పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్ - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు చేతిలో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ మరో రెండు సినిమాలపై చర్చిస్తున్నాడు. లోఫర్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన పూరి, ప్రస్తుతం ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

రోగ్ పూర్తికాగానే కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కనున్న సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత మరో నందమూరి హీరో ఎన్టీఆర్తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ మూడు సినిమాలను వరుసగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్కెచ్ వేస్తున్నాడు. ఈ సినిమాల వర్క్ జరుగుతుండగానే తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ సినిమా చేయడానికి ఒప్పించిన పూరి జగన్నాథ్, తాజాగా మరో హీరోను కూడా లైన్లో పెట్టాడు. కామెడీ సినిమాల కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు పూరి. నరేష్ కూడా చాలా కాలంగా పూరి సినిమా కోసం ఎదురుచూస్తుండటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement
Advertisement