పక్కాగా ప్లాన్ చేస్తున్న బన్నీ | Sakshi
Sakshi News home page

పక్కాగా ప్లాన్ చేస్తున్న బన్నీ

Published Sat, Apr 22 2017 3:16 PM

పక్కాగా ప్లాన్ చేస్తున్న బన్నీ

ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో ఉన్న అల్లు అర్జున్, ఆ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాను చేయబోయే నెక్ట్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుదని ప్రకటించిన బన్నీ.. ఆ సినిమా రిలీజ్ డేట్పై కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడు.

యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న బన్నీ నెక్ట్స్ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండగా.. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ జగన్నాథమ్ పనులు పూర్తి చేసి జూన్ నెలలో ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Advertisement
Advertisement