త్వరలోనే 'శ్రీరస్తు శుభమస్తు' | Sakshi
Sakshi News home page

త్వరలోనే 'శ్రీరస్తు శుభమస్తు'

Published Fri, Jun 10 2016 7:58 AM

త్వరలోనే 'శ్రీరస్తు శుభమస్తు'

గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్ , ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత వరకు వచ్చింది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో కూడా ఇన్నాళ్లు క్లారిటీ ఇవ్వలేదు.

గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు.

మార్చిలో సినిమాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత సైలెంట్ షూటింగ్ కార్యక్రమాలు కానిచ్చేశారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా ప్రకటించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement