యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు: సల్మాన్‌ | Sakshi
Sakshi News home page

యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు: సల్మాన్‌

Published Wed, Jun 14 2017 3:51 PM

alman Khan talks about war-mongering, sympathises with Army families

న్యూఢిల్లీ: ‘భారత్‌-పాక్‌’ యుద్ధంపై బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. యుద్ధం ఒకటే సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా సల్మాన్‌ తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ ప్రమోషన్‌లో భాగంగా భావోగ్వేదానికి గురయ్యారు.

యుద్ధం వల్ల ఇరు పక్షాల సైన్యాలు తమ జీవితాలను కోల్పోతారని, దాంతో వారి కుటుంబాలు... కుమారులు లేదా వారి తండ్రులు లేకుండానే తమ జీవితాలను గడపాల్సి ఉంటుందని అన్నారు. అలాగే యుద్ధం చేయాలని చెప్పేవారికి తుపాకులు ఇచ్చి యుద్ధం చేయమని చెప్పాలని సల్మాన్‌ వ్యాఖ్యానించారు.

కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, ఆయన సోహైల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో ట్యూబ్‌లైట్‌ చిత్రం తెరకెక్కింది. చైనాతో యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ అమాయకుడిగా, సోహైల్‌ చైనాతో యుద్ధంలో పాల్గొనే ఓ సైనికుడి పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో చైనా నటి ఝు ఝు హీరోయిన్‌గా నటించింది. అలాగే 'ట్యూబ్‌లైట్' ద్వారా సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ తొలిసారిగా నిర్మాతగా మారారు.

Advertisement
Advertisement