నాని చేతుల మీదుగా అమీ తుమీ.. | Sakshi
Sakshi News home page

నాని చేతుల మీదుగా అమీ తుమీ..

Published Sun, Apr 16 2017 10:34 AM

నాని చేతుల మీదుగా అమీ తుమీ..

రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన అమీ తుమీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా యంగ్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులతో పాటు హీరో నాని పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement