రోబో-2లో బిగ్ బీని వద్దన్న రజనీ! | Sakshi
Sakshi News home page

రోబో-2లో బిగ్ బీని వద్దన్న రజనీ!

Published Tue, Jan 12 2016 6:04 PM

Amitabh Bachchan offered negative in Robot, says reports

ముంబై: ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రోబో-2 సినిమాలో విలన్ పాత్రకు తొలుత బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు వినిపించిందట. ఈ విషయాన్ని రజనీకాంత్కు చెబితే ఆయన వద్దని వారించినట్టు సమాచారం. అమితాబ్ విలన్ పాత్ర చేయడం బాగుండదని, ఇలాంటి పాత్రల్లో నటిస్తే ఆయన అభిమానులకు నచ్చదని రజనీ సలహా ఇచ్చాడట.  

ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్గా తీస్తున్న రోబో-2లో విలన్గా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. విలన్గా నటించడం తనకు ఇబ్బందిలేదని, తన అభిమానులు ఆస్వాదిస్తారని చెప్పాడు.  ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అక్షయ్ అన్నాడు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది సినిమాల్లో నటించారని, తాను తొలిసారి నటిస్తున్నాని చెప్పాడు. అక్షయ్ గతంలో మరాఠి, పంజాబీ చిత్రాల్లో నటించాడు.

Advertisement
Advertisement