నా బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇది | Sakshi
Sakshi News home page

నా బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇది

Published Thu, Mar 28 2019 1:31 AM

Amitabh Bachchan Wishes to Ram Charan - Sakshi

‘‘చరణ్‌.. నీ వయసెంతో నాకు సరిగ్గా తెలియదు. కానీ నిన్ను ఎప్పుడు చూసినా 18 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటావు’’ అని రామ్‌చరణ్‌ దిల్‌ ఖుష్‌ చేశారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. బుధవారం (మార్చి 27) రామ్‌చరణ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా చరణ్‌ కోసం ఓ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ను వీడియో రూపంలో అందించారు. ‘‘ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చరణ్‌. ఈ సందర్భంగా నీకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పదలచుకున్నాను. నువ్వు చేసే ప్రతీ పనిలో సక్సెస్‌ అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను, నా కుటుంబం మొత్తం కోరుకుంటున్నాం. నువ్వు వండర్‌ఫుల్‌ పర్సన్‌వి. అలానే ఎప్పుడూ  18ఏళ్ల కుర్రాడిలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వీడియోలో తెలిపారు.

వీడియో చివర్లో ‘‘నీ మాతృభాషలో శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా? పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్‌’’ అని తెలుగులో చెప్పడం విశేషం. ఈ వీడియో మెసేజ్‌కు రామ్‌చరణ్‌ స్పందిస్తూ – ‘‘థ్యాంక్యూ అమితాబ్‌ బచ్చన్‌గారు. నాకు లభించిన బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ మీ విషెస్‌. మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలో మీరు అన్న ప్రతీ మాటను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఒకవేళ యంగ్‌గా కనిపించడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరైనా ఉండాలంటే అది కచ్చితంగా మీరే’’ అన్నారు. చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా’. ఈ సినిమాలో చిరంజీవికి గురువు పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement