18 నెలలుగా ‘ఐ’తోనే.. | Sakshi
Sakshi News home page

18 నెలలుగా ‘ఐ’తోనే..

Published Fri, Nov 1 2013 4:22 AM

18 నెలలుగా ‘ఐ’తోనే..

సుమారు 18 నెలలుగా ఐ చిత్రం కోసమే పనిచేస్తున్నట్లు హీరోయిన్ ఎమిజాక్సన్ పేర్కొంది. మదరాసుపట్టణం, తాండవం చిత్రాలతో మెప్పించింది ఈ విదేశీ బ్యూటీ. ఈమె నటిస్తున్న తాజా చిత్రం ఐ. స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకముందు అన్నియన్ రూపొందిన విషయం తెలిసిందే. ఐ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎమిజాక్సన్ మాట్లాడుతూ ఐ చిత్రం కోసం 18 నెలలుగా నటిస్తున్నానని తెలిపింది. రెండు నెలలు చైనాలో షూటింగ్ జరిగిందని చెప్పింది. 
 
ఈ క్రమంలో భాషాపరమైన సమస్యలూ తప్పలేదని వెల్లడించింది. మొత్తం మీద ఐ చిత్రంలో నటించడం సవాల్‌తో కూడుకుందని తెలిపింది. ఈ చిత్రంలో తమిళ అమ్మాయిగా నటిస్తున్నట్లు వివరించింది. దర్శకుడు శంకర్ మణియమ్మాళ్ అంటూ పాత్ర పేరుతోనే తనను పిలుస్తున్నారని పేర్కొంది. తమిళంలో ప్రస్తుతం నూతన చిత్రాల కథలు వింటున్నానని తెలిపింది. తనకు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఆశ అని, అలాంటి పాత్రలు లభిస్తే వెంటనే కాల్‌షీట్స్ ఇస్తానని స్పష్టం చేసింది. కోలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటులు చాలామంది ఉన్నారని, ధనుష్ నటన అంటే తనకు చాలా ఇష్టమని ఎమి పేర్కొంది. 
 

Advertisement
Advertisement