రెండేళ్లలో తెలుగు డబ్బింగ్‌ చెబుతా | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో తెలుగు డబ్బింగ్‌ చెబుతా

Published Thu, Jan 25 2018 1:04 AM

Amyra Dastur Interview - Sakshi

‘‘నా పాత్ర పేరు నిత్య. యోగా టీచర్‌ని. మంజులగారు నన్ను ఆడిషన్‌ ద్వారా ఎంపిక చేశారు. పైగా నిత్య పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే నటించేందుకు ఒప్పుకున్నా’’ అని కథానాయిక అమైరా దస్తూర్‌ అన్నారు. సందీప్‌కిషన్, అమైరా దస్తూర్‌ జంటగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమైరా పలు విశేషాలు పంచుకున్నారు.

► బీకామ్‌ చదివిన నేను మోడల్‌గా చేశా. ‘ఇస్సక్‌’ అనే హిందీ చిత్రం ద్వారా తొలిసారి కెమెరా ముందుకొచ్చా. జాకీచాన్‌ ‘కుంగ్‌ ఫు యోగా’, ఇమ్రాన్‌ హష్మి ‘మిస్టర్‌ ఎక్స్‌’, ధనుష్‌ ‘అనేగన్‌’(తెలుగులో అనేకుడు) తదితర సినిమాల్లో నటించా. తెలుగులో ‘మనసుకు నచ్చింది’ నా తొలి సినిమా.
► అందం, అభినయానికి ప్రాధాన్యం ఇస్తా. ఈ సినిమాలో అలాంటి పాత్రే దక్కినందుకు హ్యాపీ. పాటలకు వచ్చి వెళ్లిపోయే పాత్ర కాదు నాది. కథతో పాటు సాగుతుంది. కొద్దిసేపట్లో పెళ్లిచేసుకోబోయే సూరజ్‌ (సందీప్‌), నిత్య ఎందుకు పారిపోయారు? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే ఆసక్తికరం.
► మంజులగారు ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. సందీప్‌ కిషన్‌ మంచి సహనటుడు. సెట్‌లో ఎంతో హెల్ప్‌ చేశాడు. తెలుగు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు నేర్చుకుంటున్నా. రెండేళ్లలో నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటాను.
► రాజ్‌తరుణ్‌తో ‘రాజుగాడు’ చిత్రంలోనూ నటిస్తున్నా. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించా లని ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement