విలన్‌గా యాంకర్‌ అనసూయ..!

18 Feb, 2020 18:17 IST|Sakshi

అనసూయ భరద్వాజ్‌..ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై పలు షో లు చేసుకుంటూ  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఆ అందాల యాంకరమ్మ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా సుకుమార్‌, రాంచరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. వరుస ఆఫర్లు వచ్చాయి. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలకపాత్ర పోషించింది.

(చదవండి : యాంకర్‌ అనసూయకు వేధింపులు)

ఈ ఏడాది కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో అనసూయ ప్రతినాయకురాలిగా నటిస్తోందట. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. మరి ఇన్నిరోజులు తన అందంతో ఆకట్టుకున్న ఈ యాంకరమ్మ విలన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.  ప్రస్తుతం అనసూయ  సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటిస్తోంది. పవన్‌ కల్యాణ్‌-క్రిష్‌ తీయబోతున్న సినిమాలోనూ ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా