బ్లాక్ లిస్ట్‌లో ఆయన ఫోన్! | Sakshi
Sakshi News home page

బ్లాక్ లిస్ట్‌లో ఆయన ఫోన్!

Published Mon, Sep 26 2016 11:26 PM

బ్లాక్ లిస్ట్‌లో ఆయన ఫోన్!

ప్రముఖుల జీవితాల్లో ఏది జరిగినా మీడియాకు ఎక్కేస్తుంది. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీల విడాకుల కథలోని సంగతులు ఇప్పుడు అలాగే బయటకొస్తున్నాయి. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్‌తో పన్నెండేళ్ల సహ జీవనం, రెండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఏంజిలినా జోలీ కోర్టులో కేసు వేశారు.

ఆరుగురి పిల్లల్ని తీసుకుని అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అంతే కాదండోయ్... ఇన్ కమింగ్ మెస్సేజ్‌లతో పాటు బ్రాడ్ పిట్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా జోలీ బ్లాక్ లిస్టులో పెట్టారట. దాంతో, హీరోగారు షాకయ్యారట. ‘‘గతంలో చాలాసార్లు విడాకులు ఇస్తానని బెదిరించింది. నిజంగా ఇంత పని చేస్తుందనుకోలేదు’’ అని సన్నిహితుల వద్ద బ్రాడ్ పిట్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వార్త. ఈ స్టార్ విడాకుల కేసులో పోను పోనూ ఇంకెన్ని కబుర్లు బయటికొస్తాయో చూడాలి.
 

Advertisement
Advertisement