ప్రధానిగా అనుపమ్‌ ఖేర్‌ని చూశారా..? | Sakshi
Sakshi News home page

ప్రధానిగా అనుపమ్‌ ఖేర్‌ని చూశారా..?

Published Thu, Apr 5 2018 6:49 PM

Anupam Kher Unveils First Look OF The Accidental Prime Minister - Sakshi

మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్‌ సింగ్‌ పై తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిష్టర్’‌. అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో  విడుదల చేశారు. ప్రధాని​ పాత్రలో ఖేర్‌ తెల్లని గడ్డంతో, తలపాగ ధరించి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సంజయ్‌ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిష్టర్‌’ ఆధారంగా  ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  విజయ్‌ రత్నాకర్‌ గుట్లే దర్శకత్వం వహిస్తున్నారు. లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement