అవసరాల హీరోగా మరో సినిమా | Sakshi
Sakshi News home page

అవసరాల హీరోగా మరో సినిమా

Published Thu, Dec 22 2016 12:13 PM

అవసరాల హీరోగా మరో సినిమా

కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలీవుడ్ స్టార్ అవసరాల శ్రీనివాస్. స్టార్ కమెడియన్గా కొనసాగుతూనే ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన జెంటిల్మన్ సినిమాతో విలన్ గానూ మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' రిలీజ్కు రెడీ అవుతోంది.

బాలీవుడ్ అడల్డ్ మూవీ హంటర్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అవసరాల సెక్స్ అడిక్ట్గా నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు అవసరాల శ్రీనివాస్. విజయ్ అనే కొత్త దర్శకుడి సినిమాలో హీరోగా నటించేందుకు ఓకె చెప్పాడు. బాబు బాగా బిజీ రిలీజ్ తరువాత దర్శకుడిగా నానితో సినిమా చేసే ప్లాన్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత., తను హీరోగా విజయ్ తెరకెక్కించే సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement
Advertisement