బాహుబలి నిర్మాతల నుంచి మరో ఫాంటసీ

6 Jun, 2017 11:45 IST|Sakshi
బాహుబలి నిర్మాతల నుంచి మరో ఫాంటసీ

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. మన మార్కెట్ వంద కోట్లకు కూడా చేరని సమయంలో 250 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. నిర్మాణంతో పాటు ప్రమోషన్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్తో వ్యవహరించిన బాహుబలి నిర్మాతలు తెలుగు సినిమా కలెక్షన్ల స్టామినాను నేషనల్ లెవల్కు తీసుకెళ్లారు. అదే ఫార్ములాను తమ నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారు ఆర్కా మీడియా మేకర్స్.

బాహుబలి తరువాత తమ బ్యానర్లో మరో భారీ ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు కేయస్ ప్రకాష్ దర్శకత్వంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాను 40 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్నారట. కేవలం 20 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న శర్వా హీరోగా, ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేని ప్రకాష్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసి మరోసారి తమ గట్స్ చూపించారు. గతంలో ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఫాంటసీ సినిమా అనగనగా ఓ ధీరుడు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.