బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

15 Jul, 2019 00:32 IST|Sakshi
తనిష్క్, హరీష్, శివ నిర్వాణ, బ్రహ్మానంద రెడ్డి, అనిల్‌ పి.జి

‘‘బైలంపుడి’ ట్రైలర్‌ చూశా.. చాలా బాగుంది. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. పక్కా కమర్షియల్‌ అంశాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత బ్రహ్మానందరెడ్డి చేసిన విలన్‌ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు సాగర్‌ అన్నారు. హరీష్‌ వినయ్, తనిష్క తివారి జంటగా అనిల్‌ పి.జి.రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైలంపుడి’. తారా క్రియేషన్స్‌ పతాకంపై బ్రహ్మానందరెడ్డి నటిస్తూ, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో అలీ మాట్లాడుతూ– ‘‘బైలంపూడి’ కథగానీ, డైరెక్టర్‌గానీ, ప్రొడ్యూసర్‌గానీ నాకు తెలియదు. మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. ఈ సినిమా తియ్యడానికి చాలా కష్టపడ్డాం అన్నారు. సినిమా మీద ప్యాషన్‌తో కొత్తవాళ్లు రావడం మంచిది. ఇండస్ట్రీకి కొత్తనీరు రావాలి’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలవడానికి యూనిట్‌తో పాటు, ఇక్కడకి వచ్చిన ఎంతో మంది అతిథులు చాలా సహాయం చేశారు. డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనివాస్‌రెడ్డిగారు మా సినిమాని అన్ని ఏరియాల్లో అమ్మేశారు. నేను ఇంత దూరం రావడానికి నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు బ్రహ్మానందరెడ్డి. ‘‘ఒక ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు అనిల్‌ పి.జి.రాజ్‌. 

మరిన్ని వార్తలు