'యోధుడు'గా బాలయ్య..? | Sakshi
Sakshi News home page

'యోధుడు'గా బాలయ్య..?

Published Sat, Mar 12 2016 12:29 PM

'యోధుడు'గా బాలయ్య..? - Sakshi

నందమూరి బాలకృష్ణ వందో సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంత వరకు ఎవరినీ ఫైనల్ చేయలేదు. అయితే బాలయ్య మాత్రం క్రిష్ లేదా కృష్ణవంశీలతో తన వందో సినిమా ఉంటుందంటూ హింట్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే బాలయ్య కోసం క్రిష్ ఓ చారిత్రక కథాంశాన్ని రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

రెండో శతాబ్దంలో అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు గౌతమీపుత్ర శాతకర్ణి అనే టైటిల్ పెట్టాలని భావించినా, ఆ టైటిల్ పలకటం అంత సులువుగా లేదని యోధుడు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. ఇప్పటికే జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేసిన బాలకృష్ణ మరోసారి అదే తరహా పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్తో కలిసి డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన లెజెండ్ 38 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో బాలయ్య పై 80 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement