సొగసు చూడతరమా! | Sakshi
Sakshi News home page

సొగసు చూడతరమా!

Published Wed, Mar 25 2015 11:39 PM

సొగసు చూడతరమా!

అందాల భామలు వయ్యారాలు ఒలికిస్తుంటూనే పురుష పుంగవుల మదిలో వేల వేణువులు మోగుతాయి. ఇక సౌందర్యాన్నంతా కళ్లముందు అలా అలా ప్రత్యక్షం చేసి ప్రసన్నం కావిస్తుంటే... పులకించి పిచ్చెక్కిపోరూ! హాలీవుడ్ సుందరి సిండీ క్రాఫోర్డ్ ఓ తెల్లటి పల్చనైన పూల పూల నెటెడ్ గౌను మాత్రమే ధరించి... ఫొటోలకు పోజులిచ్చి... మతి పోగొట్టింది.

పొడవాటి జుత్తును లూజుగా వదిలేసి... ఒంటిపై ఎలాంటి ఆభరణాలూ లేకుండా... ఆకృతిని అందంగా ప్రజంట్ చేసేలా దిగిన ఈ ఫొటో షూట్ నెట్‌లో ఇప్పుడు అప్సరసతాండే! మొత్తానికి ఇద్దరు పిల్లల తల్లయిన ఈ నలభై తొమ్మిదేళ్ల సూపర్ మోడల్... ఈ వయసులోనూ రకరకాల భంగిమల్లో కనిపించి హాట్ హాట్‌గా అదరగొడుతోంది.

Advertisement
Advertisement