బాధపడింది శింబునే | Sakshi
Sakshi News home page

బాధపడింది శింబునే

Published Sat, Dec 26 2015 8:33 AM

బాధపడింది శింబునే

చెన్నై : తమిళసినిమా నటుడు శింబు రాసి, పాడిన మహిళలను అవమానించేదిగా కలకలం సృష్టిస్తున్న బీప్ సాగ్ వివాదం రచ్చ రచ్చగా మారింది. అయితే ఇప్పటి వరకూ శింబును శిక్షించాల్సిందే అంటూ ఏక గొంతు వినిపించింది. తాజాగా కొద్దిగా స్వరం మారింది. శింబుకు మద్దతుగా కొన్ని గొంతులు వినిపించడం విశేషం.


బాధింపునకు గురైంది శింబునే
నటుడు శింబుపై కోవై, చెన్నైలలో నాలుగు విభాగాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శింబు పరారీలో ఉన్నట్లు తన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో గురువారం శింబు తల్లి ఉషారాంజేందర్ ఆవేదన భేటీ ఒక వర్గాన్ని కదిలించిదనే చెప్పాలి. ఒక ప్రముఖ న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీప్ వ్యవహారంలో నిజానికి బాధింపునకు గురైంది నటుడు శింబునేనని ఆయన పాటను దొంగిలించి ఇంటర్నెట్‌లో విడుదల చేసిన వ్యక్తిని కనుగొనడంలో పోలీసులు విఫలం అయ్యారని అన్నారు.

అంతే కాదు ఇది తుపాన్ బాధితుల సమస్యను మరుగున పడేయడానికి ప్రభుత్వం పన్నుతున్న కట్ర అని కూడా ఆరోపించడం గమనార్హం.అదే విధంగా నటుడు, నడిగర్‌సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ... శింబు చర్య క్షమార్హమే అంటూ పేర్కొన్నారు. అదే విధంగా నటి రాధిక శరత్‌కుమార్ శింబు వ్యవహారంలో నడిఘర్ సంఘం జోక్యం చేసుకోదేమ్ అంటూ ప్రశ్నించారు.


శింబు వల్ల మహిళలకు మానసిక క్షోభే
కాగా మహిళా సంఘాలు మాత్రం నటుడు శింబు వల్ల ప్రతి స్త్రీకీ మానసిక క్షోభేనని దుయ్యపడుతున్నారు.ఇక పోలీసులైతే  శింబు పోలీస్‌స్టేషన్‌కు  ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వకుంటే అతని కోసం గాలించి అరెస్ట్ చేయడం సబబేనని అంటున్నారు.ఇలా శింబు బీప్ సాంగ్ వ్యవహారం ఇంకా రచ్చరచ్చగానే ఉంది.

Advertisement
Advertisement