బోయపాటి కూడా అల్లుడుకే ఫిక్స్? | Sakshi
Sakshi News home page

బోయపాటి కూడా అల్లుడుకే ఫిక్స్?

Published Wed, Jul 13 2016 1:33 PM

బోయపాటి కూడా అల్లుడుకే ఫిక్స్? - Sakshi

స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో శ్రీనివాస్. తొలి సినిమానే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్తో చేసిన శ్రీనివాస్, అల్లుడు శీనుగా ఆకట్టుకున్నాడు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా నిరాశపరిచినా.. శ్రీనివాస్కు మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

అయితే ఈ యంగ్ హీరో చేసిన రెండో సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్పీడున్నోడుగా రెండో ప్రయత్నం చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న అల్లుడు శీను, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్వకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. సరైనోడు సినిమాతో సూపర్ ఫాంలో ఉన్న బోయపాటి మరో హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు మరోసారి ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అల్లుడు శీనుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కోసం.. మరోసారి అల్లుడు వచ్చేలా టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే అల్లుడు బంగారం అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారు. అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా ఇదే బెల్లంకొండ, బోయపాటిల సినిమా టైటిల్ అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

Advertisement
Advertisement