భరత్ అనే నేను..! | Sakshi
Sakshi News home page

భరత్ అనే నేను..!

Published Tue, Dec 6 2016 3:06 AM

భరత్ అనే నేను..! - Sakshi

ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు? పట్టాభిషేకం జరిగేటప్పుడు. ఎవరు చేస్తారు? ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచాక, చట్టసభల్లో అడుగు పెట్టేటప్పుడు ‘ఫలానా అనే నేను..’ అని ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేశ్‌బాబు కూడా ఇటువంటి ప్రమాణ స్వీకారమే చేయబోతున్నారట! మహేశ్ రాజకీయాల్లోకి రావడం లేదు గానీ, రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించనున్నారని టాక్. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
 
 డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేశారట! ఇటీవలే ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాణ సంస్థ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది. మహేశ్-కొరటాల సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం. ‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత అంశం చూపించిన కొరటాల తాజా సినిమాలో ఎలాంటి కథను చూపిస్తారో అనే ఆసక్తి మహేశ్ ఫ్యాన్స్‌లో నెలకొంది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ నిమిత్తం మహేశ్ అహ్మదాబాద్‌లో ఉన్నారు.
 

Advertisement
Advertisement