పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి.. 

23 Jan, 2020 14:52 IST|Sakshi

భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెలివిజన్‌ రంగానికి చెందిన తన లాంగ్‌టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌లో తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇంకా తేదీపై  నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ ఎవరనేది మాత్రం రాణి రహస్యంగా ఉంచారు. అతని గుర్తింపును ఇప్పుడు వెల్లడించలేనని.. కానీ తొందరలోనే  వివరాలు చెబుతానని అన్నారు. అలాగే వెడ్డింగ్‌ ప్లాన్స్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సంప్రాదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ససురా బడా పైసావాలా సినిమాతో రాణి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్రా బడా సతవేల, ఏక్ లైలా తీన్‌ చైలా, నాగిన్, రాణి చాలీ సాసురల్‌, దులారా.. వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. అలాగే భోజ్‌పురిలో స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు