కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

9 Aug, 2019 23:01 IST|Sakshi

అలీరెజా, పునర్నవికి బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ పూర్తైంది. వారిద్దరి గురించి పెరుగును, పరుపులను, చెప్పులను, ఎగ్స్‌ను హౌస్‌మేట్స్‌ వదులుకున్నారు. సీక్రెట్‌ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు కోర్ట్‌ యార్డ్‌ను హౌస్‌మేట్స్‌ అందరూ ఉపయోగించుకునే వీలును కల్పించాడు. సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా.. మిగిలిన హౌస్‌మేట్స్‌లో తమకు నచ్చని వారి గురించి చెప్పమని ఆ ఇద్దరికి బిగ్‌బాస్‌ తెలిపాడు. శ్రీముఖి, హిమజ, రాహుల్‌, బాబా భాస్కర్‌ల గురించి పునర్నవి.. మహేష్‌ విట్టా, తమన్నా, వితికాల గురించి అలీరెజా చెప్పుకొచ్చాడు. ఈ తతంగాన్ని లివింగ్‌ ఏరియాలో కూర్చుని మిగతా హౌస్‌మేట్స్‌ చూస్తూ ఉన్నారు. రెండో వారంలో హౌస్‌మేట్స్‌ బిగ్‌బాస్‌ ఇంటి నియమాలను ఉల్లంఘించినవారి లెక్క సరిచేశాడు. ఇంటి మొదటి కెప్టెన్‌ అయిన వరుణ్‌ సందేశ్‌ కెప్టెన్సీ పూర్తిగా విఫలమైందని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. సిగరెట్‌ స్మోకింగ్‌ జోన్‌లో ఒక్కరి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదని నిబంధన ఉన్నా.. చివరకు కెప్టెన్‌ అయి ఉండి కూడా ఆ నిబంధనను పాటించలేదు.. ఇది చిన్న ఉదాహరణ అని వరుణ్‌ సందేశ్‌ కెప్టెన్సీపై ఫైర్‌ అయ్యాడు.

పగలు నిద్రపోవడం, మైక్‌ను ధరించడంలో నిర్లక్క్ష్యం చూపడం లాంటివి ఇంటిసభ్యులు తరుచుగా చేస్తున్నారంటూ అందరికీ శిక్షను విధించాడు. కెప్టెన్‌గా వరుణ్‌ ఫెయిల్‌ కావడంతో.. ఇకపై వరుణ్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని తెలిపాడు. అంతేకాకుండా.. ఇంటి సభ్యులకు సేవకుడుగా మారుతాడని, వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు డోర్‌ తీయాలని, అందరికీ భోజనం వడ్డించాలని, గిన్నెలను కూడా కడగాలని ఆదేశించాడు. స్మోకింగ్‌ జోన్‌ నిబంధనను ఉల్లంఘించిన బాబా భాస్కర్‌, శ్రీముఖి, అలీ రెజా, మహేష్‌, రవికృష్ణలను గార్డెన్‌ ఏరియాలో ఉన్న డ్రమ్ములోని నీరు కారిపోకుండా చేతి వేళ్లను అడ్డుపెట్టి ఆపాలని ఆర్డర్‌ వేశాడు. మైక్‌ను సరిగా ధరించకపోవడం, నిద్రపోవడం లాంటివి చేసిన తమన్నా, అషూరెడ్డి, హిమజ, వితికా, రోహిణిలకు మరో శిక్షను విధించాడు. తాను అనౌన్స్‌మెంట్‌ చేసిన ప్రతీసారి వారంతా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ దిమ్మతిరిగి దారిలోకి వచ్చి.. బిగ్‌బాస్‌ను క్షమించమని ప్రార్థించారు. మళ్లీ కొందరు మైక్‌ను సరిగా ధరించకపోవడం, తెలుగులో కాకుండా వేరే భాషలో మాట్లాడటంతో రెండు మూడు సార్లు అనౌన్స్‌చేశాడు. బిగ్‌బాస్‌ అనౌన్స్‌మెంట్స్‌తో తమన్నా, అషూరెడ్డి, హిమజ, వితికా, రోహిణిలు స్విమ్మింగ్‌ పూల్‌లో దూకుతూ ఉన్నారు.

బిగ్‌బాస్‌లో మూడో వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది. ఈ వారంలో నామినేషన్స్‌ బహిరంగంగా పెట్టడం ఓ చిచ్చు పెడితే.. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌ రక్తాన్ని కల్లజూసింది. నిధిని దోచుకోవడానికి డంబెల్‌తో అద్దాలను పగలగొట్టడం.. రవి కృష్ణ కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. చేతికి తీవ్ర గాయం కావడం.. శ్రీముఖికి శిక్షను విధించడం హైలెట్‌గా నిలిచాయి. వీకెండ్‌ వచ్చింది.. హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరించేందుకు నాగ్‌ రానున్నాడు. మరి ఈ వారంలో నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్‌, తమన్నా, వితికా, రాహుల్‌, పునర్నవిల్లో ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో చూడాలి. హౌస్‌ నుంచి తమన్నా ఎలిమినేట్‌ కానుందని ఇప్పటికే సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న వేళ అసలు ఏం జరుగుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!