బిలాల్‌పూర్‌లో... | Sakshi
Sakshi News home page

బిలాల్‌పూర్‌లో...

Published Tue, Nov 7 2017 1:02 AM

Bilalpur Police Station Movie shooting almost completed - Sakshi

శ్రీనాథ్‌ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మక్కం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’. జగ్గిలొల్లి అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగే ఈ కథలో లవ్, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ సమతూకంగా ఉంటాయి. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’’ అన్నారు నాగసాయి. ‘‘పోలీస్‌ నేపథ్యంలో వచ్చే ఫార్ములా సినిమాలకు మా చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇలాంటి కథను ఇంత వరకు స్క్రీన్‌పై చూసి ఉండరు’’అన్నారు శ్రీనివాసులు.

Advertisement
Advertisement