Sakshi News home page

వారందరూ హీరోలే!

Published Sun, Mar 10 2019 3:06 AM

Bilalpur Police Station Release Date March 15 - Sakshi

మాగంటి శ్రీనాథ్‌ హీరోగా నాగసాయి మాకం దర్శకత్వంలో మహకాంళీ శ్రీనావాస్‌ నిర్మించిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనాథ్‌ మాట్లా డుతూ– ‘‘పోలీసులు లేకుండా సమజాన్ని ఒక్క గంట కూడా ఊహించుకోలేం. పోలీసులతో పాటు చట్టాన్ని రక్షించేవారందరూ హీరోలే. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో నటించాను.

బిలాల్‌పూర్‌ అనే ఊరికి కొత్త పోలీస్‌ ఆఫీసర్‌గా వెళ్లిన నాకు అక్కడ ఎలాంటి వింత కేసులు ఎదురయ్యాయి? నేను ఎలా అసహనానికి గురయ్యాను? అనే అంశాలను వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం చాలా సహజంగా ఉంటుంది. నాగసాయి చక్కగా తెరకెక్కించారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండ నిర్మించారు. నాకే కాదు ఈ సినిమాకు పనిచేసిన అందిరకీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ప్రణవి, ఆర్‌ఎస్‌ నందా, వెంకట్‌ గోవాడ, మల్లేష్, వైభవ్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు సాబూ వర్గీస్‌ సంగీతం అందించారు.

Advertisement
Advertisement