సింగిల్‌ టేక్‌లో చేయలేను..! | Sakshi
Sakshi News home page

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

Published Sun, Aug 4 2019 8:05 AM

Bollywood Actress Jacqueline Fernandez Interview - Sakshi

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ‘హౌస్‌ఫుల్‌’ ‘రేస్‌’ ‘కిక్‌’... సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మన తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తుందో తెలియదుగానీ... ప్రభాస్‌ ‘సాహో’లో ఐటమ్‌సాంగ్‌ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక సుందరి జాక్వెలైన్‌ మనసులో మాటలు సంక్షిప్తంగా...

నటనపై ఆసక్తి : ఏడేళ్ల వయసులో.
నటి కాకపోయి ఉంటే : జంతువులంటే ఇష్టం. వాటి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే... వైల్డ్‌లైఫ్‌ డాక్యుమెంటేరియన్‌ అయ్యేదాన్ని.
ఇండస్ట్రీలో నచ్చే వ్యక్తులు : చాలా మంది ఉన్నారు. మచ్చుకు కొందరు... సాజిత్‌ నడియాడ్‌వాలా... ఈయనతో ఏడు సినిమాలు చేశాను. అఫ్‌కోర్స్‌ సల్మాన్‌ఖాన్‌! నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సుజయ్‌ ఘోష్, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ సోనమ్‌ కపూర్, నటనలో ఇన్‌స్పిరేషన్‌ ప్రియాంక చోప్రా.
సినిమాల్లో ఇష్టమైన జానర్‌ : కమర్షియల్‌.
నేర్చుకున్నది: ‘అయ్యో తప్పులు చేస్తున్నాను’ అని టెన్షన్‌ పడితే మరిన్ని తప్పులు చేస్తాం. టెన్షన్‌ పడుతున్న టైమ్‌లో సగం టైమ్‌ ‘ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి?’ అనే దాని గురించి ఆలోచిస్తే తప్పులకు దూరంగా ఉండవచ్చు.
సినిమా కోసం నేర్చుకున్నది : పోల్‌ డ్యాన్స్‌. నేర్చుకునేటప్పుడుగాని తెలియలేదు అదెంత కష్టమో! కష్టం సంగతి ఎలా ఉన్నప్పటికి పోల్‌ డ్యాన్స్‌ను ‘ఫెంటాస్టిక్‌ వర్కవుట్‌’ అంటాను. బాడీని ఫిట్‌గా ఉంచుతుంది.
నవ్వు తెప్పించే జ్ఞాపకం : ఒక సీన్‌ చేయడానికి టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటున్నాను. ‘‘ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ఓకే అయిపోవాలి’’ అంటున్నాడు డైరెక్టర్‌. ‘‘మహానటి మార్లిన్‌ మన్రో ఒక సీన్‌ కోసం 53 టేక్‌లు తీసుకుందట. నేనేంత!’’ అన్నాను. ‘‘కానీ నువ్వు మార్లిన్‌ మన్రో కాదు కదా’’ అన్నాడు డైరెక్టర్‌. అంతే... అక్కడ ఉన్నవాళ్లంతా ఒకటే నవ్వడం!
సల్మాన్‌ గురించి : డైలాగులు పలకడంలో ఏమైనా ఇబ్బంది పడితే... ఎలా పలకాలో కూల్‌గా చెబుతారు. సెట్‌లో ఎంత సరదాగా ఉంటారో! పని విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌!
సల్మాన్‌లో బాగా నచ్చే విషయం ఏమిటంటే ‘క్రెడిట్‌’ను ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోడు. ఎవరైతే కష్టపడతారో వాళ్ల ఖాతాలో వేస్తాడు!
సలహా: సల్మాన్‌ఖాన్‌ను సలహాలు అడగడానికి ఇష్టపడతాను. ఏదో సలహా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను అని కాకుండా ఆయన సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరికీ తనవంతుగా సహాయపడాలనేది ఆయన విధానం.
అదృష్టం అంటే? : రాత్రి బెడ్‌ మీద వాలగానే కంటినిండా నిద్ర పట్టడం.
హాట్‌ హాట్‌గా: పొద్దున వర్కవుట్స్‌ తరువాత వేడివేడిగా బుల్లెట్‌ప్రూఫ్‌ కాఫీ తీసుకుంటాను.
పర్సనల్‌ స్టైల్‌: కంఫర్ట్‌గా ఉండే స్టైల్‌ను ఇష్టపడతాను.
నచ్చేవి: ప్రయాణాలు. ప్రయాణాల వల్ల మనం రీఛార్జ్‌ అవుతాం. కొత్త వ్యక్తులను, కొత్త ప్రదేశాలను చూడడం మాత్రమే కాదు... కొత్తగా ఆలోచించగలుగుతాం.
ఇష్టం: పుస్తక పఠనం. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ‘ఒక యోగి ఆత్మకథ’ ఇష్టమైన పుస్తకం. పాల్‌ కోయిలో పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.

Advertisement
Advertisement