విలక్షణ టైటిళ్లతో దూసుకుపోతున్నబాలీవుడ్ | Sakshi
Sakshi News home page

విలక్షణ టైటిళ్లతో దూసుకుపోతున్నబాలీవుడ్

Published Fri, May 23 2014 9:18 PM

Bollywood film titles, As desi as it gets

న్యూఢిల్లీ: మచిలీ జల్ కీ రాణీ హై... దమ్ లగాకే హైసా... వంటి మాటలను పిల్లలు పాడుకునే పద్యాల్లోనో, పల్లెటూళ్లలోనో ఎక్కువగా వింటుంటాం. అయితే ఇప్పుడు అవే బాలీవుడ్ సినిమా పేర్లవుతున్నాయి.  ఇలా విలక్షణమైన పేర్లను పెడుతూ ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 2014లో ఇప్పటిదాకా విడుదలైన, తెరకెక్కుతున్న చిత్రాల పేర్లను గమనిస్తే కథ, కథనంతో సంబంధం లేకుండా కేవలం ప్రచారం కోసం మాత్రమే ఇలాంటి విలక్షణమైన పేర్లను పెడుతున్నారనే అభిప్రాయం కలగకమానదు.

 

పరంథేవాలీ గలీ.., మిస్టర్. జో బి. కర్వాలో.., బబ్లూ హ్యాపీ హై.., హసీ తో ఫసీ.., టోటల్ సియప్పా.., ఓ తెరీ.., లక్కీ కబూతర్ వంటి చిత్రాలు పేర్లతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయనే చెప్పాలి. సాధారణంగా మాట్లాడుకునే మాటలను ఇలా సినిమా పేర్లుగా మార్చేసి ఉచితంగా ప్రచారం చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. ఇక తెరకెక్కుతున్న సినిమా పేర్లు కూడా విచిత్రంగానే ఉంటున్నాయి.
ఫగ్లీ, హంప్టీ శర్మాకీ దుల్హనియా, కుకు మథుర్ కి తో ఝండ్ హోగయీ, గుడ్డూ రంగీలా, మచిలీ జల్ కీ రాణీ హై, అమిత్ సాహ్నీ కి లిస్ట్, దమ్ లగాకే  హైసా వంటి పేర్లతో సినిమాలు రాబోతున్నాయి. మరిన్ని విచిత్రమైన టైటిళ్లు రిజస్టర్ అయ్యాయి కూడా. ఈ విషయమై ముంబైకి చెందిన సినిమా ప్రముఖుడు అసూజా మాట్లాడుతూ... ‘ఇలా విలక్షణమైన పేర్లు పెట్టడం బాలీవుడ్‌కు ఇప్పుడే కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి విచిత్రమైన టైటిళ్లతో అనేక సినిమాలు వచ్చాయని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement