ఈ సినిమాకు 150 సెన్సార్ కట్లు! | Sakshi
Sakshi News home page

ఈ సినిమాకు 150 సెన్సార్ కట్లు!

Published Mon, Jan 11 2016 5:15 PM

ఈ సినిమాకు 150 సెన్సార్ కట్లు!

ముంబై: బాలీవుడ్ చిత్రం క్యా కూల్ హై హమ్ 3 (కేకేహెచ్హెచ్ 3) దర్శక, నిర్మాతలకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తోంది. ఉమేష్ గాడ్గె దర్శకత్వంలో ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సెక్స్-కామెడీ సినిమాకు ఏకంగా దాదాపు 150 కట్లు వేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు సమాచారం. కేకేహెచ్హెచ్ 3 దర్శక, నిర్మాతలు ఈ ఊహించని పరిణామానికి కంగుతిన్నారు. సెన్సార్ బోర్డు ఆదేశాల ప్రకారం కేకేహెచ్హెచ్ 3కు 150 కట్లు వేస్తే.. ఈ సినిమా కాస్తా షార్ట్ ఫిలింలా అయిపోతోందని గగ్గోలు పెడుతున్నారు.  ఇక ఈ సినిమాకు ఎడల్ట్ సర్టిఫికెట్ రావడం ఖాయమేనట.

కేకేహెచ్హెచ్ 3 ప్రోమోలు, ట్రైలర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్లు, బూతు జోక్లు ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో తుషార్ కపూర్, అఫ్తాబ్ శివ్దాసాని, మందన కరిమి ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement
Advertisement