గరిటతో చరణ్‌.. పైపు పట్టిన చిరంజీవి

16 Apr, 2020 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినిమాల్లో హీరో అవ్వడం కాదు భార్య మనసు దోచుకుని సూపర్‌ హీరో అనిపించుకున్నారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌. తాజాగా రామ్‌ చరణ్‌కు లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణి ఉపాసన కోసం ప్రత్యేకంగా వంటవండారు. దీనికి సంబంధించి వీడియోను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వంట వండటమే కాదు, తర్వాత పాత్రలను కూడా ఆయనే శుభ్రం చేశారు. ఇందుకే చరణ్‌ నా దృష్టిలో హీరో అయ్యారు అంటూ ఉపాసన పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న భర్తలు ఇది గమనించాలని సూచించారు.

మరో వైపు రామ్‌ చరణ్‌ తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి పైపు పట్టి ఇంటి ముందున్న ప్రాంతాన్ని శుభ్రం చేశారు. మనం నడిచే దారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటూ, ఇంట్లోనే ఉండండి అంటూ తన లాక్‌డౌన్‌ అనుభవాలను ట్విటర్‌లో వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు