సినీ దర్శకుడు లారెన్స్పై చీటింగ్ కేసు | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు లారెన్స్పై చీటింగ్ కేసు

Published Fri, Sep 26 2014 8:20 AM

సినీ దర్శకుడు లారెన్స్పై చీటింగ్ కేసు - Sakshi

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్ పై గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకరాం ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మాతలు. సినిమా ప్రారంభానికి ముందే లారెన్స్ నిర్మాతల మధ్య సినిమా ఖర్చు విషయంలో ఒప్పందం కుదిరింది. రూ.23 కోట్లతో సినిమాను పూర్తి చేస్తానని, అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు.

ఇందుకు సంబంధించి నిర్మాతలు దర్శకుడికి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ సినిమాకు అనుకున్న దానికంటే రూ.5కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. ఇంత మొత్తాన్ని తాము భరించలేమని ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అదనంగా ఖర్చు చేసిన రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇచ్చేది లేదని లారెన్స్ మొండికేశారు.

 

జవాబు కూడా చెప్పడం మానేశాడు. దీంతో బాధిత నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా... లారెన్స్ పైన, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మధ్యవర్తిగా ఉన్న అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్పైన కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు లారెన్స్ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement