Sakshi News home page

కలవాలని అనుకున్న కానీ...

Published Sun, Sep 2 2018 7:59 PM

Chiranjeevi Special Birthday Wishes To Pawan Kalyan - Sakshi

ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఆయన తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కళ్యాణ్‌ బాబు.. నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకోని విరమించాను. నీకు పట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ హనుమాన్‌, నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను. ఆశీస్సులతో అన్నయ్య, చిరంజీవి’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

చిరంజీవి సందేశాన్ని ఆయన కోడలు ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఆ సందేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి మరో ట్వీట్‌ చేశారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ కూడా సాహసోపేతమైన పారాగ్లైడింగ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ తన బాబాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement