డ్రెస్‌కోడ్‌లో చిరు, చెర్రీ.. ఫోటో షేర్‌ చేసిన ఉపాసన | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 21 2018 10:22 AM

Chiranjeevi Visits Azerbaijan Sets Photo Shared by Upasana - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఇక త్వరలోనే జార్జియాలో జరుగనున్న ‘సైరా’ షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరు కూడా వెళ్లబోతోన్నాడు. ఈలోపే చెర్రీ షూటింగ్‌ సెట్‌లో ప్రత్యక్షమై చిరు సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు. 

అజర్‌బైజాన్‌లో జరుగుతున్న షూటింగ్‌లో చిరు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. చిరుతో పాటు ఉపాసన, సుష్మిత, సుష్మిత భర్త కూడా విచ్చేశారు. ఇక సరదాగా వీరంతా కలిసి డిన్నర్‌కి వెళ్లారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘డిన్నర్‌ డేట్‌ విత్ మావయ్య.. అందరం బ్లాక్‌ డ్రెస్‌కోడ్‌లో ఉన్నామ’ని ట్వీట్‌ చేశారు. దాదాపు 25 రోజుల పాటు అజర్‌ బైజాన్‌లో షూటింగ్‌ చేసి, యూనిట్‌ ఇండియా చేరుకుంటుందని సమాచారం. 

Advertisement
Advertisement