స్పెషల్‌ గెస్ట్‌ | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ గెస్ట్‌

Published Fri, Sep 21 2018 3:25 AM

chiranjeevi visits ramcharan tej new movie sets - Sakshi

అజర్‌ బైజాన్‌ వెళ్లారు చిరంజీవి. అదేంటీ ‘సైరా’ సినిమా కోసం ఆయన జార్జియాలో కదా ఉండాలి? అంటే అది నిజమే. కానీ చిరంజీవి ఇంకా జార్జియా సెట్‌లో జాయిన్‌ అవ్వలేదట. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్‌ రాజేశ్, ప్రశాంత్, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది.

ముఖ్యంగా రామ్‌చరణ్, వివేక్‌ ఒబెరాయ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ను విజిట్‌ చేశారు చిరంజీవి. సినిమా ప్రోగ్రెస్‌ గురించి అడిగి తెలుసుకున్నారట. అంటే తనయుడి  సినిమా లొకేషన్‌కు చిరంజీవి స్పెషల్‌ గెస్ట్‌గా వెళ్లారన్న మాట. దాదాపు 25 రోజుల పాటు అజర్‌ బైజాన్‌లో షూటింగ్‌ చేసి,  యూనిట్‌ ఇండియా చేరుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement