లైఫ్‌లో రొమాన్స్ ఉండాలి | Sakshi
Sakshi News home page

లైఫ్‌లో రొమాన్స్ ఉండాలి

Published Tue, Feb 25 2014 11:37 PM

లైఫ్‌లో రొమాన్స్ ఉండాలి

ఓ వర్షం కురిసిన సాయంత్రం వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తూ ఆలుమగలు తియ్యటి కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అనుభవించినవారికి తెలుస్తుంది. అలాంటి అనుభవంతో పాటు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, రొమాన్స్, అలకల సమాహారంతో రూపొందిన చిత్రం ‘కాఫీ విత్ మై వైఫ్’. అనీష్ తేజేశ్వర్, సింధు లోక్‌నాథ్ జంటగా నీలం శంకర్ సమర్పణలో మదన్ నిర్మించారు. విద్యాసాగర్ దర్శకుడు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఇద్దరు ప్రేమికుల జీవితంలోని కొంగొత్త పరిణామాలే ఈ సినిమా. లైఫ్‌లో రొమాన్స్ ఉండాలనేది కొత్త తరం కోరిక. అది ఎలా ఉంటే అందంగా ఉంటుందో తెలియజెప్పే సినిమా. పెళ్లి చేసుకోబోయేవాళ్లకు, చేసుకున్నవాళ్లకు ఇద్దరికీ జీవితంలో కొత్త కోణాలను చూపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే స్వీట్ రొమాన్స్, ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ల కలబోత ఇది. పాటలకు మంచి ఆదరణ లభించింది. మార్చి ప్రధమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ఆనంద్, సాహిత్యం: చైతన్య ప్రసాద్, బాలాదిత్య, కెమెరా: విశ్వ దేవబత్తుల.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement