పోరాట యోధునిగా.. | Sakshi
Sakshi News home page

పోరాట యోధునిగా..

Published Mon, May 4 2015 11:31 PM

పోరాట యోధునిగా..

చారిత్రాత్మక నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది.  రుద్రమదేవి సేనాధిపతిగా పనిచేసిన మాచిదేవ పాత్రను నటుడు సాయికుమార్ పోషిస్తున్నారు. షణ్ముఖ ఆర్ట్స్ పతాకంపై ద్వారంపూడి శంకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నంది కామేశ్వరరెడ్డి దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘12వ శతాబ్దంలో అప్పటి కులమతాలకు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లల్లో  సాయి మాచిదేవా ఒకరు. ఈ పాత్రలో సాయికుమార్ పరకాయ ప్రవేశం చేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: థ్రిల్లర్ మంజు, సంగీతం: హంసలేఖ.
 

Advertisement
Advertisement