కరోనాపై కీరవాణి కదిలించే పాట..

1 Apr, 2020 14:41 IST|Sakshi

అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌(కోవిడ్‌-19). ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్‌, సంగీత దర్శకుడు కోటి  అందించిన పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌.. వి స్టే సేఫ్‌’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్‌ చేసి ఆలపించారు.

‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి’, ‘ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి’ అనే లిరిక్స్‌ ప్రజల్లో చైతన్యంతో పాటు మనో​ధైర్యాన్ని తీసుకొ​స్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్‌ నెం. 1’ సినిమాకి కంపోజ్‌ చేసిన  ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’  పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. ఇక గతంలో కూడా కరచాలనం కంటే చేతులెత్తి నమస్కారం చేయడం ఎంత మంచిదో వివరిస్తూ ఓ పద్యాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. 

చదవండి:
కరోనా కట్టడికి బిల్‌గేట్స్‌ సూచనలు!
‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు