అలజడి... | Sakshi
Sakshi News home page

అలజడి...

Published Tue, Feb 10 2015 12:26 AM

అలజడి... - Sakshi

అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి రాజుగారి కుటుంబం అంటే ఎంతో గౌరవం. రాజుగారికి మాత్రం ఎనిమిదేళ్ల మనవరాలు బంగారం అంటే ప్రాణం. కానీ ఓ రోజు  ఆమె చేసిన పని రాజుగారి కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘దాగుడు మూత దండాకోర్’. ఆర్.కె. మలినేని దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి సహనిర్మాత  క్రిష్. ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 హీరోయిన్ నిత్యా మాట్లాడుతూ -‘‘దుబాయ్‌లో పెరిగినా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలంటే ఇష్టపడే అమ్మాయిగా ఇందులో నటించా’’ అని చెప్పారు. ‘‘మరదలు కోసం సిటీ నుంచి పల్లెటూరికి వ చ్చే పాత్ర నాది’’ అని హీరో సిద్ధు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇ.ఎస్. మూర్తి, కెమెరా: వి. ఎస్. జ్ఞానశేఖర్, సహనిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి.
 

Advertisement
Advertisement