రజనీ కూతురుగా ధన్సికా | Sakshi
Sakshi News home page

రజనీ కూతురుగా ధన్సికా

Published Mon, Aug 10 2015 8:57 AM

రజనీ కూతురుగా ధన్సికా

చెన్నై: ప్రముఖ తమిళ నటి ధన్సికా అనతికాలంలోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. త్వరలో తెరకెక్కనున్న రజనీ 159వ చిత్రంలో ధన్సికాను రజినీ కూతురుగా నటించే పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తమిళ చిత్ర వర్గాలు తెలిపాయి. 'రజనీ కాంత్ 159వ చిత్రంలో ఆయన కూతురుగా నటించే పాత్రకోసం ధన్సికా ఇటీవలె సంతకం చేసింది.

రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నారు' అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సినిమా షూటింగ్  ప్రారంభించాల్సి ఉన్నా చిత్ర యూనిట్కు వీసాలు ఇంకా రాని కారణం వల్ల కొంత ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్ స్టర్గా నటిస్తున్నారు. ధన్సికా అరవాన్, పరదేశీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.
 

Advertisement
Advertisement