వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్ | Sakshi
Sakshi News home page

వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్

Published Sat, Dec 12 2015 8:33 PM

వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్

చెన్నై: వరుస భారీ విజయాలతో జోరు మీదున్న తమిళ స్టార్ హీరో ధనుష్ మరింతగా దూసుకుపోతున్నాడు.   విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ  క్రేజీ హీరో చేతినిండా  ప్రాజెక్టులతో   బిజీబిజీగా మారనున్నాడు.   తాజాగా  తమిళంలో మరో సినిమాకు సైన్ చేసి తన హవాను కొనసాగిస్తున్నాడు.   పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని ఈ శుక్రవారం అఫీషియల్ గా లాంచ్ చేశారు.  కోడి గా  టైటిల్  ఖరారు చేసుకున్న  ఈ మూవీ  షూటింగ్  కార్యక్రమాలు ఈ  నెలలోనే  ప్రారంభం కానున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.  
 
అయితే ధునుష్ లేటెస్ట్ మూవీ  తంగమగన్  చిత్రం ట్రైలర్, ఆడియో  నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.  ధనుష్ సరసన సమంతా, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.   అనిరుధ్ రవిచందర్  సంగీతం అందించారు.  తెలుగులో నవ మన్మథుడు పేరుతో వస్తోంది.  ఈ సంవత్సరంలో ధనుష్ నటించిన రెండు సినిమాలు  ఇప్పటికే విజయం సాధించగా మూడో  సినిమా ఈ డిసెంబర్ 18 న థియేటర్లను పలకరించనుంది.   
 
ధురై సెంథిల్ కుమార్  దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో  ధనుష్ సరసన త్రిష నటించనుందని సమాచారం.  కోడి అనే  టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.  డిసెంబర్ చివరివారంలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నామని చిత్ర వర్గాలు  వెల్లడించాయి.

Advertisement
Advertisement