‘నా వైఫ్‌ దిశ.. తను కనిపించట్లేదు సర్‌’

9 Feb, 2020 16:22 IST|Sakshi

వరుస సినిమాలతో జోరు మీదున్న దిగంగన సూర్యవంశీ హీరోయిన్‌గా నిర్మితమవుతున్న రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వలయం’, లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్‌ కడుముల దర్శకత్వం వహించాడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తు​న్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ‘నిన్ను చూశాకే’ అంటూ వచ్చిన రొమాంటిక్‌ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.  

తాజాగా ‘వలయం’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 103 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌ తొలుత హీరో హీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసు​కోవడంతో ప్రారంభమవుతుంది. తర్వాత కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ వెంటనే యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్‌ అంశాలను ట్రైలర్‌లో జోడించారు. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శేఖర్‌ చంద్ర సంగీతమందించిన ఈ చిత్రం నితిన్‌ ‘భీష్మ’కు పోటీగా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.     

చదవండి:
అఘోరాగా బాలకృష్ణ
సామజవరగమన పాట అలా పుట్టింది..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి