ఆ స్టార్స్‌ కోసం స్టోరీలు రెడీ చేస్తున్నా | Sakshi
Sakshi News home page

ఆ స్టార్స్‌ కోసం స్టోరీలు రెడీ చేస్తున్నా

Published Wed, Dec 20 2017 12:55 AM

'E Ee' to release on December 22 | - Sakshi

‘‘నాది అత్తిలి. ఇంటర్‌ అవగానే యానిమేషన్‌ నేర్చుకుందామని హైదరాబాద్‌  వచ్చినప్పుడు దర్శకుడు మారుతితో స్నేహం కుదిరింది. తను దర్శక–నిర్మాతగా మారితే, నేను ఫ్రాన్స్‌లో యానిమేషన్‌ డెరైక్టర్‌ అయ్యాను. ఓ మంచి సినిమా తీయాలని ఇక్కడికొచ్చి ‘ఇ ఈ’ తెరకెక్కించా’’ అని దర్శకుడు రామ్‌ గణపతిరావు అన్నారు. నీరజ్‌ శ్యామ్, నైరా షా జంటగా ఆయన దర్శకత్వంలో లక్ష్మణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ 22న రిలీజ్‌ కానుంది.

రామ్‌ గణపతిరావు మాట్లాడుతూ– ‘‘అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయి, అమ్మాయిలంటే ఇష్టం లేని అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ అబ్బాయేమో అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారతారు. వారు ఎందుకలా మారారు? అన్నది సస్పెన్స్‌. వినోదం ఉంది. మదర్‌ సెంటిమెంట్, ఎమోషనల్‌ సీన్స్‌కి ఆడియన్స్‌ కంటతడిపెట్టుకుంటారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేయాలని కథలు కూడా సిద్ధం చేస్తున్నా’’ అన్నారు.

Advertisement
Advertisement