హీరోగా చేయాలని చేసిన సినిమా కాదిది! | Sakshi
Sakshi News home page

హీరోగా చేయాలని చేసిన సినిమా కాదిది!

Published Tue, Jul 11 2017 1:39 AM

హీరోగా చేయాలని చేసిన సినిమా కాదిది!

‘‘ఇప్పుడు పనిగట్టుకుని హీరోగా చేయాల్సిన అవసరం నాకు లేదు. స్క్రిప్ట్‌ నచ్చడంతో ‘పటేల్‌ సార్‌’ చేశా. డైరెక్టర్స్‌ ఛాలెంజిగ్‌ రోల్స్‌ ఆఫర్‌ చేస్తే ఆ కిక్కే వేరు. అలా కిక్‌ ఇచ్చే పాత్రలు చేయడం నాకిష్టం. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు పెరుగుతున్నాయి. అందుకే సూపర్‌ స్క్రిప్ట్‌ అనిపిస్తేనే హీరోగా చేస్తా’’ అన్నారు జగపతిబాబు. వాసు పరిమి దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజినీ కొర్రపాటి నిర్మాతగా, సాయి కొర్రపాటి నిర్మాణసారథ్యంలో రూపొందిన ‘పటేల్‌ సార్‌’ ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. కొంత గ్యాప్‌ తర్వాత హీరోగా చేయడం, ఇతర విశేషాలను జగపతిబాబు ఈ విధంగా పంచుకున్నారు.

‘పటేల్‌ సార్‌’ పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా. నిజానికి లుక్‌ కుదిరితేనే చేద్దామనుకున్నా. అందుకే, ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోయా. సాయి కొర్రపాటిగారు నిర్మాత కావడంతో ఈ సినిమాకి బలం చేకూరింది. అందుకే ఈ సినిమాకి ఆయన ఫస్ట్‌ హీరో. యూనిట్‌లో ఉన్న 150 మందీ ఈ సినిమాకి హీరోలే. ∙

కొంతమంది  డిస్టిబ్యూటర్స్, బయ్యర్స్‌ ఈ స్టోరీ లైన్‌ విని, సూపర్‌హిట్‌ సాధిస్తారని చెప్పారు. మలయాళంలో ‘పులి మురుగన్‌’ చేశాక అక్కడివాళ్లు నన్ను ‘డాడీ గిరిజా’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను ‘పటేల్‌ సార్‌’ అని పిలిస్తే, ఆశ్చర్యపోనక్కర్లేదు. ∙

ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ చూసినవాళ్లల్లో కొందరు ఇది థ్రిల్లర్‌ సినిమానా లేక హర్రరా? అనుకునే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ డ్రామాలో నడిచే థ్రిల్లర్‌ మూవీ. రాజమౌళిగారు నిజానికి దగ్గరగా ఉండే మనిషి. అలాంటి ఆయన ఈ సినిమా గురించి ట్వీట్‌ చేశారంటే సినిమా ఎంత బాగుంటుందో ఉహించుకోవచ్చు.  

‘పటేల్‌ సార్‌’ సూపర్‌హిట్‌ అవ్వకపోతే నిరుత్సాహపడతాను. ఈ సినిమాపై నాకంత నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకమూ ఉంది. ∙

రిచ్‌ బిజినెస్‌మేన్, రిచ్‌ ఫాదర్‌ క్యారెక్టర్స్‌ అంటే నేనే అన్నట్లుగా అయిపోయింది. అందుకే ‘పూర్‌ క్యారెక్టర్స్‌’ వస్తే బాగుంటుందనుకుంటున్నా. కొంతమంది అడగడానికి మొహమాటపడి నాదాకా రారు. ఎవరైనా వచ్చి నన్ను కలవొచ్చు. కథ నచ్చితే ఎలాంటి రోల్స్‌ చేయడానికైనా రెడీ. ‘దంగల్‌’లో ఆమిర్‌ఖాన్‌ డిఫరెంట్‌ రోల్‌ ట్రై చేశారు. అలాంటి క్యారెక్టర్‌ ఒకటి చేయబోతున్నా. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినప్పుడు మాత్రం హీరో తర్వాత నాకు పేరు రావాలని ట్రై చేస్తాను. నేను ఎవరితోనూ పోటీపడను. నా 20 సినిమాలూ నాకుంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ∙

‘సముద్రం’ అనే టెలీఫిల్మ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. కొన్ని బ్యాడ్‌ ఇన్సిడెంట్స్‌తో లైఫ్‌ ఆగిపోదు. యూటర్న్‌ తీసుకుని ఎక్కడో ఒకచోట మళ్లీ మంచిగా ప్రారంభం కావాల్సిందే. అందుకు నా జీవితం ఓ ఉదాహరణ. అది కొంతమందికి ఇన్‌స్పిరేషన్‌ అవ్వాలన్నది ఈ టెలీఫిల్మ్‌ ముఖ్యోద్దేశం.

Advertisement
Advertisement