ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’ | Sakshi
Sakshi News home page

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

Published Tue, Sep 3 2019 10:57 AM

Gopichand's Chanakya Release For Dusshera - Sakshi

ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్‌ తిరు ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తయ్యింది.

గోపీచంద్‌ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇట‌లీ, మిలాన్‌లో  పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుగుతోంది. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement
Advertisement