వాళ్లకు పాజిటివ్‌.. మాకు నెగెటివ్‌ 

1 Jul, 2020 01:12 IST|Sakshi

‘‘మా సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది’’ అని వెల్లడించారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌. ఈ విషయం గురించి మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా ఆమిర్‌ స్పందిస్తూ – ‘‘మా సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో నేను, మా ఆవిడ, పిల్లలు టెస్ట్‌ చేయించుకున్నాం. మా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కానీ చివరిగా మా అమ్మగారు (జీనత్‌ హుస్సేన్‌) కరోనా పరీక్ష చేయించుకోనున్నారు. ఆమెకు నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నాను. కరోనా సోకిన మా సిబ్బందిని వెంటనే క్వారంటైన్‌లో ఉంచాం. ముంబై అధికారులు వారికి మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించారు. మా సిబ్బంది మాదిరిగానే చాలామంది ఆరోగ్యాలను కాపాడేందుకు పోరాడుతున్న ముంబై అధికారులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... కొన్ని రోజుల క్రితం నిర్మాత బోనీకపూర్‌ సిబ్బంది, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ సిబ్బంది కూడా కరోనా బారిన పడి, ఆ తర్వాత కోలుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు