Happy Wedding Movie Review, in Telugu | ‘హ్యాపి వెడ్డింగ్‌’ మూవీ రివ్యూ | Happy Wedding 2018 - Sakshi
Sakshi News home page

Published Sat, Jul 28 2018 2:27 PM

Happy Wedding Telugu Movie Review - Sakshi

టైటిల్ : హ్యాపి వెడ్డింగ్‌
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, ఇంద్రజ తదితరులు..
సంగీతం : శక్తికాంత్‌ కార్తీక్‌
నేపథ్య సంగీతం : తమణ్ ఎస్‌
దర్శకత్వం : లక్ష్మణ్‌ కార్య
నిర్మాత : పాకెట్‌ సినిమా

స్టార్‌ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెలలు తమని తాము ప్రూవ్‌ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హ్యాపి వెడ్డింగ్‌. నూతన దర్శకుడు లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా యువీ క్రియేషన్స్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ సమర్పణలో తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆడియోతో పాటు టీజర్‌, ట్రైలర్‌లు కూడా ఆకట్టుకోవటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ హ్యాపి వెడ్డింగ్‌ అందుకుందా..? నిహారిక, సుమంత్‌ అశ్విన్‌ల కెరీర్‌లకు ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుంది..?

కథ ;
ఇది విజయవాడ అబ్బాయి, హైదరాబాద్‌ అమ్మాయిల పెళ్లి కథ. విజయవాడలో ఉండే గోపాల్‌ (నరేష్‌), లలిత(పవిత్రా లోకేష్‌)ల అబ్బాయి ఆనంద్‌ విరాట్‌ వాకలపూడి (సుమంత్‌ అశ్విన్‌). యాడ్‌ ఫిలింకు మేకర్‌ అయిన ఆనంద్‌ది మెచ్యూర్డ్‌ గా ఆలోచించే మనస్థత్వం. హైదరాబాద్‌లో ఉండే హనుమంతరావు (మురళీ శర్మ), లత(తులసి)ల అమ్మాయి అక్షర (నిహారిక కొణిదెల). డిజైనర్‌ గా పనిచేసే అక్షరది ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోలేని చంచల మనస్థత్వం. (సాక్షి రివ్యూస్‌) ఓ బస్సు ప్రయాణంలో ప్రేమలో పడిన వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ ఆనంద్‌ చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా అక్షర పెళ్లి విషయంలో ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో తను గతంలో ప్రేమించిన విజయ్‌ (రాజా) మరోసారి తన జీవితంలోకి రావటంతో.. ఆనంద్‌ను పెళ్లి చేసుకోవాలా.. వద్దా..? అన్న సందిగ్థంలో పడిపోతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఎలా రియాక్ట్‌ అయ్యాయి..? చిరవకు అక్షర, ఆనంద్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
విజయవాడ అబ్బాయిగా సుమంత్‌ అశ్విన్‌, హైదరాబాద్‌ అమ్మాయిగా నిహారికలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. లవర్‌ బాయ్‌ రోల్స్‌ లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సుమత్‌ అశ్విన్‌, మరోసారి అదే తరహా పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో సుమంత్‌ అశ్విన్‌ నటన సూపర్బ్‌. ఒక్కమనసు సినిమాతో నిరాశపరిచిన నిహారికకు ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. (సాక్షి రివ్యూస్‌)పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపించారు. సీనియర్‌ నరేష్‌, మురళీ శర్మ, పవిత్రా లోకేష్‌, తులసి, ఇంద్రజ, రాజాలు రొటీన్‌ పాత్రల్లో కనిపించారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ ;
తెలుగు తెర మీద పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఘన విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే బాటలో హ్యాపి వెడ్డింగ్‌ సినిమాతో మరో అందమైన ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. పెళ్లి ఇంట్లో ఉండే హడావిడి, కుటుంబ బంధాలను బలంగా చూపించిన దర్శకుడు, హీరో హీరోయిన్ల మధ్య గొడవకు కారణాన్ని మాత్రం అంత బలంగా తయారు చేసుకోలేదు. చిన్న విషయానికి హీరోయిన్‌ పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం సిల్లీగా అనిపిస్తుంది. అదే సమయంలో కథనం కూడా నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్‌)సినిమాకు ప్రధాన బలం సంగీతం. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించి పాటలు బాగున్నాయి. పాటలు కావాలని ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వచ్చి వెలుతూ అలరిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
ఎమోషనల్‌ సీన్స్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
నెమ్మదిగా సాగే కథనం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

        మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

తప్పక చదవండి

Advertisement