కత్తి లాంటి హీరోయిన్‌లు | Sakshi
Sakshi News home page

కత్తి లాంటి హీరోయిన్‌లు

Published Fri, Jul 31 2015 12:15 AM

Heroines like the sword

సినిమా ఫీల్డ్‌లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒక ఫ్యాక్షన్ సినిమా హిట్టవ్వగానే... వరుస పెట్టి అందరూ ఫ్యాక్షన్ సినిమాలే చేసేశారు. కొన్నాళ్లు సీక్వెల్స్ హవా నడిచింది. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే - కథానాయికల కత్తి యుద్ధాలు, బాణాల ఫైటింగులు. పూలూ పళ్లు పట్టుకోవాల్సిన ఈ సుకుమార సౌందర్యరాశులు కత్తి పట్టుకుని వెండితెర బరిలో చెలరేగిపోతున్నారు. గ్లామరస్ క్యారె క్టర్స్‌కే కాదు... వీరోచిత పాత్రలకూ పనికొస్తామని నిరూపించుకునే పని మీద ఉన్నారు హీరోయిన్లు. ఆ వీర వనితలపై ఓ స్పెషల్ లుక్...
 
 అనుష్క కత్తికి రెండు వైపులా పదునే!
 ‘అరుంధతి’ చిత్రంతో తనలో పవర్ ఫుల్ నటి ఉన్న విషయాన్ని నిరూపించు కున్న అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల ద్వారా తన వీరత్వాన్ని చాటుకోవడా నికి రెడీ అయిపోయారు. ఈ రెండు చిత్రాల కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకు న్నారు. నటనే కదా అని లైట్ తీసుకోకుండా ఐదారు నెలలు శిక్షణ కూడా తీసుకున్నారామె. వీర వనితలా కనిపించాలంటే ఇవి నేర్చుకుంటే చాలా? ఆహార్యం కూడా అందుకు అనుగుణంగా ఉండాలి కదా? అందుకే, ఓ ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అయ్యారు. ‘బాహుబలి’ తొలి భాగంలో అనుష్క కనిపించిందే చాలా తక్కువ సేపు. యుద్ధాలు చేయలేదు. రెండో భాగంలో ఆమె కరవాల నైపుణ్యాన్ని తిలకించవచ్చునట. ఇక, వీర వనిత ‘రుద్రమదేవి’గా కూడా అనుష్క కత్తి ఝళిపించిన వైనం మామూలుగా లేదట. ఆ విన్యాసాలు సెప్టెంబర్ 4 నుంచి తెరపై చూడవచ్చు.
 
 సుసాధ్యాల తమన్నా
 లేత తమలపాకులా ఉండే తమన్నా కత్తి యుద్ధాలు చేయగలుగు తారా? ‘ఊహూ’ అని చాలామంది అంటారు. కానీ, తమన్నా తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. అందుకే ‘బాహుబలి’ కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. కత్తి తిప్పడం అంత సులువు కాదంటున్నారు తమన్నా. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఈ బ్యూటీకి ఇష్టం. అందుకే, కత్తి తిప్పడం నేర్చుకున్నారు.
 
 డోంట్ కేర్ హన్సిక
పాత్ర డిమాండ్ చేస్తే, ఏదైనా చేయడానికి హన్సిక వెనకాడరు. అందుకు తాజా నిదర్శనం తమిళ ‘పులి’ చిత్రం. ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా హన్సిక నటించారు. ఆమెది యువరాణి పాత్ర. అందుకోసం కోసం హన్సిక కత్తి యుద్ధం నేర్చుకున్నారు. ట్రైనింగ్ అప్పుడు ఆమెకు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. అయినా, డోంట్ కేర్ అనుకున్నారు. త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ‘పులి’లో హన్సిక కత్తి తిప్పిన వైనం చూడ్డానికి రెండు కళ్లూ చాలవట.


 
 సవాల్ చేపట్టిన దీపికా పదుకొనె
 ‘బాజీరావ్ మస్తానీ’ కోసం దీపికా పదుకొనె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకున్నారు. ఇందులో ఆమె పోరాట యోధురాలి పాత్రలో కనిపించ నున్నారు. ఇప్పటివరకూ ఏ పాత్రకూ పడనంత శ్రమ ఈ పాత్రకు పడ్డానని దీపిక అంటున్నారు. గుర్రపు స్వారీ సరదాగా అనిపించిందట కానీ, కత్తి యుద్ధం కఠినంగా అనిపించిందన్నారు. ఒకవైపు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ మరోవైపు ట్రైనింగ్ తీసుకున్నారట. అది చాలా కష్టమనిపించిం దని, రోజుకి 12 నుంచి 15 గంటలు పని చేయాల్సి వస్తోందని దీపిక అంటున్నారు. ఏది ఏమైనా నటిగా ఇది తనకు సవాల్ లాంటి పాత్ర కాబట్టే, ఎంత రిస్క్ అయినా తీసుకోవడా నికి వెనకాడటం లేదట.
 
 కత్రినా... కత్తిలాంటి ఫైటింగ్
కత్రినా కైఫ్‌ని అభిమానులు కత్రినా ‘నైఫ్’ అని ముద్దుగా పిలుచుకుంటుం టారు. తేలికగా సాగే గ్లామరస్ క్యారెక్టర్లు ఎక్కువగా చేయడంతో పాటు అడపాదడపా శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు కత్రినా. ప్రస్తుతం ఆమె ‘ఫితూర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కత్రినా గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. కత్తి యుద్ధం కూడా కొంత నేర్చుకున్నారట. గుర్రపు స్వారీ చాలా కష్టమైందని తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారట కత్రినా. పాపం ఈ చిత్రం కోసం గుర్రపు స్వారీ సీన్‌లో నటిస్తున్నప్పుడు కింద కూడా పడ్డారు. అయినా ఏం ఫీల్ కాలేదు. ఈ తరహా చిత్రాలు చేసే అవ కాశం అరుదుగా వస్తుంది కాబట్టి, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యారు.

Advertisement
Advertisement