హార్రర్... కామెడీ... ‘లచ్చి’ | Sakshi
Sakshi News home page

హార్రర్... కామెడీ... ‘లచ్చి’

Published Wed, Apr 6 2016 10:24 PM

హార్రర్... కామెడీ... ‘లచ్చి’

 బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేసిన జయతి ‘లచ్చి’ చిత్రంతో నాయికగా పరిచయమవుతున్నారు. వాస్తవానికి జయతికి నిర్మాణ రంగంలో పెట్టాలనే ఆశయం ఉంది. అందుకే హీరోయిన్‌గా కొన్ని అవకాశాలను తిరస్కరించానని చెబుతూ - ‘‘నిర్మాతగా మారాలనే ఆశయంతో మలయాళంలో విజయవంతమైన ‘మె బాస్’ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాను.
 
 ఆ టైంలోనే ‘లచ్చి’ చిత్ర దర్శకుడు ఈశ్వర్ కథ వినిపించారు. కథ, నా పాత్ర బాగా నచ్చాయి. హీరోయిన్ పాత్ర నేను  చేస్తేనే బాగుంటుందని ఈశ్వర్ అనడంతో ఓకే అన్నాను. థ్రిల్లర్, హారర్, కామెడీ అంశాల సమాహారంగా దీన్ని రూపొందించాం. ఈ వేసవిలోనే రిలీజ్. భవిష్యత్తులో నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement