చిలిపి పాత్రలంటేనే నాకిష్టం: వరుణ్ ధావన్ | Sakshi
Sakshi News home page

చిలిపి పాత్రలంటేనే నాకిష్టం: వరుణ్ ధావన్

Published Fri, Jul 4 2014 5:57 PM

చిలిపి పాత్రలంటేనే నాకిష్టం: వరుణ్ ధావన్ - Sakshi

ముంబై: వరుణ్ ధావన్... నటించింది రెండు సినిమాల్లోనే అయినా యవతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అల్లరి పనులు చేసే చిలిపి పాత్రలంటే ఇష్టపడే ధావన్ తాను అటువంటి పాత్రలకు సరిగ్గా సరిపోతానని ‘మై తేరా హీరో’ సినిమాతో నిరూపించాడు. తాజాగా ‘హంప్టీ శర్మా కి దుల్హనియా’లో కూడా దాదాపుగా అదేరకమైన పాత్ర దక్కింది. ‘సరిగ్గా నేను ఎటువంటి పాత్రలనైతే ఇష్టపడతాను అటువంటి పాత్రల్లోనే నటించే అవకాశం వస్తోంది. హంప్టీ శర్మా...లో నేను చురుకైన రోమాంటిక్ హీరోలా కనిపించినా ఎంతో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రమది. సాధారణ ప్రేమకథా చిత్రాలు చూసి ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. అందుకే హంప్లీ శర్మా కి దుల్హనియా ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కాస్త భిన్నంగా చూపించాలనుకున్నాం. ఈ ఏడాది ఉత్తమ ప్రేమకథా చిత్రంగా మా సినిమా నిలుస్తుందని భావిస్తున్నాన’ని చెప్పాడు.

 

శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ నటి ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆలియాతో కలిసి నటించడం భలే సరదాగా ఉంటుందన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement