ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా? | Sakshi
Sakshi News home page

ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా?

Published Mon, Jun 12 2017 3:23 AM

ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా?

అనుకున్నవన్నీ జరిగిపోతుంటే భగవంతుడనేవాడే గుర్తుకు రాడన్న నానుడి ఉంది. నటి హన్సిక తంతు ఇలానే ఉందనిపిస్తోంది. ఆ మధ్య వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోయిన హన్సికకు హఠాత్తుగా అవకాశాలు అడుగంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లోనే ఎక్కువ చిత్రాలు చేసింది.

మంచి విజయాలను అందుకుంది. అయినా ఇప్పటికీ హన్సికకు తమిళంలో మాట్లాడడం రాదు. అసలు నేర్చుకోవాలన్న ఆలోచనే రాలేదనుకుంటా. కాగా అమ్మడికి తాజాగా శశికుమార్‌కు జంటగా కొడివీరన్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇది మదురై నేపథ్యంలో సాగే గ్రామీణ కథా చిత్రంగా రూపొందుతోంది. అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ భాష నేర్చుకోవాలన్న జ్ఞానోదయం అయ్యిందనుకుంటా.

ఈ చిత్రంలో నటించడానికి హన్సిక తమిళ భాషను ట్యాటర్‌ను పెట్టుకొని మరీ నేర్చుకుంటోందట. భాష నేర్చుకుంటే మరిన్ని అవకాశాలు రాబట్టుకోవచ్చునని భావిస్తుందనుకుంటా. అంతే కాదు బరువు తగ్గడానికి బాగా కసరత్తులు చేస్తోందట. ఇప్పటికే చాలా సన్నబడిందట. మరింత నాజుగ్గా తయారై కోలీవుడ్‌లో మరో రౌండ్‌ కొట్టాలని ఆశపడుతందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. చూద్దాం ఈ కసరత్తులు, కొడివీరన్‌ చిత్రం హన్సిక కెరీర్‌కు ఏ మాత్రం పనికొస్తాయో. అన్నట్టు మలయాళంలోనూ ఈ ముద్దుగుమ్మ ఖాతా ఓపెన్‌ చేసింది. మోహన్‌లాల్‌ నటిస్తున్న విలన్‌ చిత్రం ద్వారా మాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇదే చిత్రం ద్వారా నటుడు విశాల్‌ ప్రతినాయకుడిగా రంగప్రవేశం చేయడం విశేషం.

Advertisement
Advertisement