‘ఎంఎస్ ధోనీ’లో నా పాత్ర ఉండదు: లక్ష్మీరాయ్

27 Sep, 2016 10:23 IST|Sakshi
‘ఎంఎస్ ధోనీ’లో నా పాత్ర ఉండదు: లక్ష్మీరాయ్

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్లో యూనిట్తో పాటు ధోనీ కూడా పాల్గొనడంపై మరింత ప్రచారం వచ్చింది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎంఎస్ ధోనీ సినిమాలో రాయ్ పాత్ర ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2008లో ధోనీ.. రాయ్తో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై లక్ష్మీ రాయ్ స్పందిస్తూ.. ఎంఎస్ ధోనీ సినిమాలో తన పాత్ర ఉంటుందని భావించడంలేదని చెప్పింది. తన గతం గురించి అనవసరంగా చర్చించుకుంటున్నారని రుసరుసలాడింది.

’2008 ఐపీఎల్ సందర్భంగా ఓ ఏడాది పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఆ సమయంలో ధోనీతో పరిచయం ఏర్పడింది. అయితే మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిశాక చెన్నై జట్టుతో అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీతో టచ్లో లేను. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ధోనీతో తనకు ఎఫైర్ ఉన్నట్టు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా కథ గురించి తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. అయితే ఎలాంటి సమాచారం తెలియలేదు’  అని లక్ష్మీ రాయ్ చెప్పింది. ధోనీకి గతంలో ప్రియాంక ఝా అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఆమె ప్రమాదంలో మరణించింది. ఎంఎస్ ధోనీ సినిమాలో ప్రియాంక ఝాతో పాటు లక్ష్మీ రాయ్ పాత్రలు ఉంటాయని భావిస్తున్నారు. 2010లో ధోనీ సాక్షి రావత్ను పెళ్లి చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ సినిమాలో అతని గాళ్ ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయా లేవా అన్నది తెరపై చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి